ప్రకాశం జిల్లా పుట్టవారిపాలెంలోని ఓ బట్టల దుకాణంలో జరిగిన దొంగతనం కేసులో నిందితులను పోలీసులు పట్టుకున్నారు. గత మూడు నెలల కిందట వెంకట సంధ్య బట్టల షాప్లో బట్టలు కొనడానికి వెళ్లిన ఇద్దరు మహిళలే ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. గుంజి కోటేశ్వరమ్మ, శివరాత్రి తిరుపతమ్మలు యజమానితో మాటలు కలిపి కౌంటర్లోని లక్షా 25 వేల రూపాయల నగదును అపహరించారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు 3 నెలల క్రితం కేసు నమోదు చేశారు. బుధవారం నిందితులిద్దరిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.
ఇవీ చదవండి