రోజురోజుకూ మారిపోతున్న నేరాల తీరుకు తగ్గట్టుగా శిక్షణ అవసరమని ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్రైనింగ్ విభాగపు ఐజీ ఎన్.సంజయ్ అన్నారు. ఒంగోలులోని పోలీసు శిక్షణ కళాశాలలో మహిళా పోలీసుల శిక్షణా కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పోలీసులతోపాటు గ్రామీణ... వార్డు సంరక్షణ కార్యకర్తలకు రెండు వారాల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. మెుత్తం 400 మందికి శిక్షణ ప్రారంభించారు. రాష్ట్రంలో మహిళా పోలీసుల సంఖ్య మరింత పెంచేందుకు ప్రయత్నిస్తున్నట్లు సంజయ్ తెలిపారు. శిక్షణలో అన్ని రకాల నేరాలు, చట్టాల పట్ల అవగాహన కల్పించనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: