ETV Bharat / state

వాటర్ ట్యాంక్ గోడ కూలి మహిళ మృతి... - వాటర్ ట్యాంక్ కూలిన ఘనటలో ఏపీలో మహిళ మృతిపై వార్త

Woman dies as water tank collapses: ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడులో విషాదం జరిగింది. వాటర్ ట్యాంక్‌ వద్ద నీళ్లు పట్టుకుంటున్న సమయంలో …మహిళపై ట్యాంక్‌ గోడ కూలి అక్కడికక్కడే మృతి చెందింది. పక్కనే ఉన్న మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన ఆమెను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. నారాయణమ్మ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

Woman dies as water tank collapses
Woman dies as water tank collapses
author img

By

Published : Nov 30, 2022, 12:35 PM IST

Woman dies as water tank collapses in AP: వాటర్ ట్యాంక్ గోడలు కూలిన ఘటనలో మహిళ మృతి చెందింది. మంచినీళ్ల కోసం వెళ్లిన మహిళలపై గోడ పడటంతో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం దూపాడు గ్రామంలో నీళ్ల ట్యాంక్ దగ్గర నీళ్ల కోసం వెళ్లిన నారాయణమ్మ అనే మహిళ బిందెలతో నీళ్లు పట్టుకుంటున్న సమయంలో ఒక్కసారిగా ట్యాంక్ గోడలు కూలి మీద పడటంతో ఆమె మృతి చెందింది.

పక్కనే ఉన్న మరో మహిళకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మృతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలంటూ గ్రామ ప్రజలు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.