Woman dead with electric shock: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకోగా.. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. ప్రకాశం జిల్లా కంభం మండలం లింగాపురంలో ఇంటి ముందు నిద్రిస్తున్న మహిళ ఫాతిమాపై.. 11 కేవీ విద్యుత్ వైరు తెగిపడ్డాయి. దీంతో మంటలు చెలరేగి ఆమె సజీవదహనమైంది. ఫాతిమాను కాపాడే ప్రయత్నంలో మరో మహిళ రామలింగమ్మకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను కంభం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉంటడంతో నరసరావుపేటకు తరలించారు.
ఇవీ చదవండి: