ప్రకాశంజిల్లా ముండ్లమూరు మండలం మారెళ్లలో విషాదం చోటు చేసుకుంది. సన్నెబోయిన సుబ్బారావు, సుబ్బులు అన్యోన్య దంపతులు. వీరికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. అందరికీ పెళ్లిళ్లు చేశారు. దంపతులిద్దరూ కుమారుల వద్ద ఉంటూ జీవనం సాగిస్తున్నారు. సుబ్బారావు వయసు పైబడటంతో బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. భర్త ఇక లేడనే విషయం తెలుసుకున్న భార్య సుబ్బులు గుండెలవిసేలా విలపించింది. ఆ క్రమంలోనే సొమ్మసిల్లి పడిపోయింది. వైద్యం అందించినప్పటికీ.. ఆమె పరిస్థితి విషమించి గురువారం సాయంత్రం ప్రాణాలు విడిచింది. భర్త మృతి చెందిన 16 గంటల్లోపే భార్య తనువు చాలించిన ఈ విషాదం అందరిని కలచివేసింది.
ఇదీ చదవండి: పోలీసుల అదుపులో బాలికపై అత్యాచార నిందితుడు