ETV Bharat / state

'కరవు ప్రాంతాల్లో వాటర్‌షెడ్‌ పథకం.. భూగర్భ జలం అపారం' - వాటర్‌షెడ్‌ పథకం న్యూస్

ప్రవహిస్తున్న నీటిని నిలిపి... ఇంకేటట్లు చేయడమే వాటర్‌షెడ్‌ పథకం ప్రధాన లక్ష్యం. కరవు ప్రాంతాల్లో వాటర్‌షెడ్‌ పథకం అమలుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గురువాజీపేటలో చేపట్టిన వాటర్‌షెడ్‌ పథకం సత్ఫలితాలు ఇస్తోంది. ఈ పథకం అమలు తీరును పరిశీలించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం... పనులు చూసి ప్రశంసించింది.

water-shed-scheme
water-shed-scheme
author img

By

Published : Nov 28, 2019, 9:22 AM IST

'కరవు ప్రాంతాల్లో వాటర్‌షెడ్‌ పథకం'

ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గురువాజీపేటలో సుమారు 46 లక్షల రూపాయలతో డ్వామా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వాటర్‌ షెడ్‌ పథకం సత్ఫలితాలిస్తోంది. భూగర్భజలాల వృద్ధితో పాటు బోడికొండను పచ్చదనంతో నింపే విధంగా ఈ కార్యక్రమం అమలవుతోంది. వర్షం సమయంలో కొండమీద నుంచి దిగువకు జోరుగా ప్రవహించే నీటికి అడ్డుకట్టువేసేలా రాతి చెక్‌డ్యాంలు నిర్మించారు. బోడికొండల చుట్టూ సుమారు 32 కిలోమీటర్లలో కందకాలు తవ్వారు. కొండ దిగువున నీటిని నిల్వ ఉంచేందుకు కుంటలు తవ్వారు.

100 ఎకరాల్లో నిర్వహణ

అధికారులు కొండను తవ్వే మెళుకువలు నేర్పటంతో సుమారు 250 మంది కూలీలు కందకాలు తవ్వి, చెక్‌డ్యాంలు నిర్మించారు. సీతాఫలం, చింత, నేరేడు, కాగు జాతులకు చెందిన 50 వేల మొక్కలు నాటారు. వర్షాలు బాగా కురవడం వల్ల మొక్కలన్నీ ఏపుగా పెరుగుతున్నాయి. సుమారు 100 ఎకరాల్లో ఈ వాటర్‌షెడ్‌ పథకాన్ని నిర్వహిస్తున్నారు. ఇటీవల వివిధ రాష్ట్రాల నుంచి వాటర్‌ షెడ్‌ సభ్యులు, సాంకేతిక నిపుణులు వచ్చి పనుల తీరును పరిశీలించారు.

కొండ ప్రాంతమంతా.. అటవీ ప్రాంతంగా

ఉపాధి హమీ పథకం ద్వారా అమలు చేసిన ఈ వాటర్‌ షెడ్డు పథకానికి గ్రామస్థులు తొలుత అభ్యంతరం చెప్పినా, మంచి ఫలితాలు రావడం వల్ల పూర్తి సహకారాన్ని అందించారు. కరవు ప్రాంతంలో ఉపాధి హమీ పథకం ద్వారా రోజువారీ కూలీ లభించేదని, ఇప్పుడు కొండ ప్రాంతమంతా అటవీ ప్రాంతంగా మారుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. 2015-16 సంవత్సరంలో 300 అడుగులలో ఉన్న భూగర్భ జలాలు ఇప్పుడు 100 అడుగులకే వస్తున్నాయని గ్రామస్థులు తెలిపారు. అధికారుల్లో చిత్తశుద్ది, ప్రజల భాగస్వామ్యం ఉంటే ఎలాంటి ప్రభుత్వ పథకాల ద్వారానైనా మంచి ఫలితాలు సాధించవచ్చని ఈ వాటర్‌షెడ్‌ పథకం నిరూపించింది.

ఇవీ చదవండి:

అక్షరం ముక్కరాదు... వ్యవసాయంలో పీహెచ్​డీ చేశాడు..!

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.