ETV Bharat / state

గుండ్లకమ్మ పరిధిలో తాగునీరు ఇప్పించండి మహాప్రభో

ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో తాగు నీటి సమస్యతో గ్రామాలు విలవిలాడుతున్నాయి. గండ్లకమ్మ ప్రాజెక్టులో పేరుకుపోయిన నీటినే వదలడంతో, వ్యాధులు సంక్రమించి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.

తీరని నీటి కష్టాలు... ఇబ్బందులు పడుతున్న ప్రజలు
author img

By

Published : Sep 7, 2019, 3:55 PM IST

తీరని నీటి కష్టాలు... ఇబ్బందులు పడుతున్న ప్రజలు

ప్రకాశం జిల్లా సంతనూతలపాడు నియోజకవర్గంలో తాగునీటి కోసం ఏర్పాటు చేసిన గుండ్లకమ్మ ప్రాజెక్టు నీటిని 90 గ్రామాల కోసం ప్రతిపాదించారు. అయితే, ఇటీవల కురిసిన వర్షాలతో కొద్దిపాటి నీరే నిలచింది. ఈ నీటినే అధికార్లు గ్రామాలకు వదులడంతో, నీరు దుర్వాసన రావడంతో పాటు క్రిమికీటకాలు నీటిలో కనిపిస్తున్నాయి. బ్యాక్టీరియా చేరిన ఈ నీరు తాగి గ్రామస్తులు అనారోగ్య పాలవుతున్నారు. గత కొంతకాలంగా సాగర్ జలాలను గుండ్లకమ్మకు ఇప్పిస్తామని అధికారులు, ప్రజా ప్రతినిధులు తెలిపిన నేటికి చుక్క నీరు రాని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన రైతులకు చుక్క నీరు అందించలేని పరిస్థితి నియోజకవర్గంలో ఏర్పడింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటే కనీసం మంచినీటినైనా గ్రామాలకు అందించిన వారవుతారని వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి

ఇస్రో ఛైర్మన్ కన్నీటిపర్యంతం- మోదీ ఓదార్పు

Intro:AP_RJY_56_07_100DAYS_VEDUKA_AV_AP10018

తూర్పు గోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ : ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట

ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు

Body:ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కేక్ కట్ చేసి పంచిపెట్టారు

Conclusion:ఈ వంద రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారని ఏ పథకాలు ఏ తేదీల్లో అమలు చేస్తామని కూడా చెప్పడం జరిగిందని జగ్గిరెడ్డి అన్నారు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.