ETV Bharat / state

తాగునీటి కోసం కటకటలాడుతున్న పొదిలి ప్రజలు

రోజులు, నెలలు కాదు. అక్కడ ఏడాది పొడవునా నీటి కొరతే. వేసవి వచ్చిందంటే కష్టాలు రెట్టింపవుతాయి. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే నీటినే దాచుకొని.. 3 రోజుల పాటు జాగ్రత్తగా వాడుకోవాలి. ఆ నీటినే పట్టి పశువులకూ సాకాలి. ఇక ట్యాంకర్ల బిల్లుల బకాయిలతో సరఫరా సరిగా సాగని పరిస్థితి. ఎడతెగని నీటి కొరతకు తాళలేక పలు కుటుంబాలు వలసపోయేలా పరిస్థితులు దిగజారాయి. ప్రకాశం జిల్లా పొదిలి మండలం నీటి కష్టాలపై ప్రత్యేక కథనం.

water problems in podili
పొదిలిలో నీటి సమస్యలు
author img

By

Published : Apr 16, 2021, 8:23 PM IST

పొదిలిలో నీటి సమస్యలు

నీటి కొరతతో అల్లాడే ప్రకాశం జిల్లాలోని పలు గ్రామాల కష్టాలు.. వేసవి రాకతో తీవ్రమయ్యాయి. పొదిలి మండలంలో తాగునీటికి ప్రజలు కటకటలాడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మండలంలో దాదాపు 20 పంచాయతీల ప్రజలను నీటి కొరత వేధిస్తోంది. రక్షిత మంచినీటి పథకాలు ఏర్పాటుచేసి దశాబ్దాలు గడవగా.. నిర్వహణ సక్రమంగా లేక శిథిలావస్థకు చేరుకున్నాయి. సాగర్‌ కాలువ నుంచి కొన్ని గ్రామాలకు సరఫరా చేస్తున్న నీరు.. శుద్ధి చేయకుండా నేరుగా పంపింగ్‌ చేస్తున్నందున రోగాల పాలవుతున్నామని గ్రామస్థులు వాపోతున్నారు.

నీటికొరతకు తాళలేక వలస..

గ్రామాల్లో ఎక్కడ చూసినా భూమి తడారిపోయిన పరిస్థితులే ఉన్నాయి. భూగర్భ జలాలు అడుగింటిపోగా.. ఆరేడు వందల అడుగుల లోతుకు తవ్వినా నీరు పడని పరిస్థితులున్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా గ్రామాలకు రెండుమూడు కిలోమీటర్ల దూరంలో డీప్‌ బోర్లు వేసి, అక్కడి నుంచి ట్యాంకుల ద్వారా ఎలాగో నీరు సరఫరా చేస్తున్నారు. అదీ 3 రోజులకోసారి మాత్రమే వస్తున్నందున.. ప్రజల అవసరాలు తీరడంలేదు. ట్యాంకుల ద్వారా వచ్చే అంతంతమాత్రం నీటినే తాగడానికి, కాలకృత్యాలకు వినియోగించుకుని.. పశువులకూ వాడుకోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. నీటికొరతకు తాళలేక పలు కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

లక్షల రూపాయల బిల్లులు బకాయిలు..

ట్యాంకర్లతో నీరు సరఫరా చేసే గుత్తేదారులకు లక్షల రూపాయల మేర బిల్లులు పేరుకుపోవడం సమస్యగా మారింది. నిర్వహణ ఖర్చులు చేతి నుంచి పెట్టుకోలేక కొంతమంది తప్పుకోవడం వల్ల.. ప్రజలకు అవసరమైన మేర నీళ్లు అందడం లేదు. జిల్లావ్యాప్తంగా ఈ బకాయిలు 72 కోట్ల రూపాయల వరకూ ఉండటం పరిస్థితికి నిదర్శనం.

బకాయిల సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే బిల్లుల చెల్లింపులు జరిగే అవకాశం ఉందని సిబ్బంది చెబుతున్నారు.

నీటి సరఫరా పెంచేలా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ప్రకాశం జిల్లా పొదిలి మండలం ప్రజలు కోరుతున్నారు.

ఇవీ చూడండి...

తెదేపా సీనియర్ నాయకుడు కోటా సాంబశివరావు మృతి

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.