ప్రకాశం జిల్లా మార్టూరు మండలం బొబ్బేపల్లి వద్ద కాలువకు గండి పడింది. సాగర్ కాలువ నుంచి వచ్చిన నీరు… రాజుగారిపాలెం - బొబ్బేపల్లి మధ్య నూతలపాడు మైనర్లో కలుస్తుంది. ప్రవాహం అధికంగా ఉన్న కారణంగా.. నూతలపాడు మైనర్ కాలువకు ఉన్న షట్టర్ పగిలిపోయి పంటకాలువల్లోకి నీరు చేరింది. కాలువ కట్టకు గండిపడి సాగర్ జలాలు వృథాగా పోతున్నాయి. వరద మరీ ఎక్కువ అయితే పంట చేలు ముంపునకు గురవుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: