పంచాయతీ కార్యదర్శి, పూర్వపు పంచాయతీ కార్యదర్శి హయాంలో వసూలు చేసిన సుమారు 40 లక్షల ఇంటి పన్నుల నిధులు గోల్ మాల్ జరగడంపై ప్రకాశం జిల్లా దేశాయి పేట గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత మూడు సంవత్సరాలకు సంబంధించి ఇంటి పన్ను చెల్లించాలంటూ గ్రామస్థులకు నోటీసులు ఇవ్వడంపై బాధితులు లబోదిబోమన్నారు. ఈ సమస్యపై అడిగేందుకు పంచాయతీ కార్యాలయానికి గ్రామస్థులు వెళ్లగా, అధికారులు, సిబ్బంది ఎవరు అందుబాటులో లేరు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న మండల అభివృద్ధి అధికారి, పంచాయతీ కార్యదర్శి కార్యాలయానికి చేరుకున్నారు. నిధుల గోల్మాల్ విషయంపై విచారణ జరిపి బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు వావిలాల దాశరధి, కోటి ఆనంద్, ఊటుకూరు వెంకటేశ్వర్లు, అచ్యుతుని బాబురావు, శామ్యూల్, బాధితులు పింజల సాంబశివరావు పాల్గొన్నారు.
ఇవీ చూడండి... ప్రకాశం జిల్లా కలెక్టరేట్లో ఆటోమెటిక్ థర్మల్ స్కానర్ ఏర్పాటు