ఒకప్పుడు రైతుల కష్టాలు ప్రజా ప్రతినిధులకు తెలియాలంటే రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ధర్నాలు చేసేవారు... వారి ట్రెండ్ మార్చి సార్వత్రిక ఎన్నికలను ఆయుధాల్లా చేసుకుంటున్నారు. వారి సమస్యలను జాతీయ స్థాయిలో చేరవేయటానికి... స్వయంగా వారే బరిలో నిల్చుంటున్నారు.
నిజామాబాద్ పసుపు రైతులు వెళ్లిన మార్గంలోనే ప్రకాశం రైతులు నడుస్తున్నారు. వెలిగొండ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేయాలని స్వయాన ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో పోటీకి సిద్ధమైనట్టు వెలుగొండ ప్రాజెక్ట్ సాధన సమితి అధ్యక్షుడు పూల సుబ్బయ్య తెలిపారు. వీరికి తెలంగాణ నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితులూ జత కలిశారు. సమస్య పరిష్కరించాలని వారణాసిలో నామినేషన్ వేయనున్నారు.
ఈ మధ్యనే తెలంగాణలో నిజామాబాద్ నియోజకవర్గంలో ఎంపీ కవితకు వ్యతిరేకంగా 178 మంది పసుపు రైతులు పోటీ చేశారు. దేశవ్యాపంగా వారికి మద్దతు కోసం ప్రధాని మోదీ, ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్న వారణాసీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి నామినేషన్ వేయనున్నట్లు నిన్న తెలిపారు. ఎవరికీ వ్యతిరేకంగా ప్రచారం చేయమని... వారి సమస్య అందరికీ తెలియాలనే ఈ ప్రయత్నమని రైతులు చెప్తున్నారు.
ఇదీ చదవండి