ప్రకాశం జిల్లా చీరాల పట్టణ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో వైయస్సార్ జనతా బజార్ సహకారంతో కూరగాయల ప్రత్యేక దుకాణాలను ఏర్పాటుచేశారు. పట్టణంలోని, 28,29,30 వార్డులలో ఏర్పాటు చేశారు. రెడ్ జోన్ పరిధిలో కూరగాయలు తక్కువ ధరలకు పంపిణీ చేయటం సంతోషకరమని... చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ఎం.గ్రెగోరి అన్నారు. మాజీఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ సూచనల మేరకు అన్ని ప్రాంతాల ప్రజలకు అతి తక్కువ ధరలకే నాణ్యమైన కూరగాయలు అందించేలా ఏర్పాటు చేశామని గ్రెగోరీ తెలిపారు. దుకాణాల వద్ద భౌతికదూరం పాటిస్తూ రెడ్ జోన్ వార్డులోని ప్రజలు కొనుగోలు చేశారు.
ఇది చదవండి పోలీస్ సిబ్బందికి ఆయుర్వేద మందుల పంపిణీ