ప్రకాశం జిల్లా అద్దంకి ఆర్టీసీ డిపో టీ స్టాల్ వద్ద పంగులూరు గ్రామానికి చెందిన యువకుడిపై దుండగులు కత్తితో దాడి చేశారు. ప్రేమ వ్యవహారమే దాడికి కారణమని బాధితుడు ఆరోపిస్తున్నాడు. గతంలో అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమ వ్యవహారం ఉండేదని.. తరచూ ఫోన్ ద్వారా మాట్లాడుకోవటం ఇరు కుటుంబాలకు తెలిసిందని చెప్పాడు. ఈ క్రమంలో.. ఇద్దరి మధ్య గొడవలు జరిగాయని.. తాను హైదరాబాద్లో పని చేసుకునేందుకు వెళ్లిపోయానని తెలిపాడు.
ఒక చోట కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుందామని యువతి తరుఫు బంధువులు యువకుడికి ఫోన్ చేసి పిలిపించారు. స్వగ్రామానికి వచ్చిన యువకుడిపై పథకం ప్రకారం కత్తితో దాడికి యత్నించారంటూ యువకుడి తల్లి ఆరోపిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి: