ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో సిమెంట్ రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. కోట్లు ఖర్చు చేసినా ఫలితం లేకుండాపోతోంది. కొత్తగా సిమెంట్ రోడ్డు వేసిన అధికారులు తగిన సౌకర్యాలు కల్పించలేదు. రహదారులకు ఇరువైపులా డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు చేయలేదు. రోడ్డు మధ్య డివైడర్లు నిర్మించాల్సి ఉండగా... వాటి కోసం స్థలం వదిలేశారు. వర్షం వస్తే రోడ్డుమీదకు నీరుచేరి మురుగు దర్శనమిస్తోంది. పట్టణంలోని త్రిపురాంతకం రోడ్డులో రూ.5 కోట్లతో రహదారి నిర్మాణం చేశారు. దీనికి డివైడర్తోపాటు... డ్రైనేజి కాలువలు నిర్మించలేదు. అలాగే పుల్లలచెరువు బస్టాండ్ రోడ్డు రూ.2 కోట్లతో సిమెంట్ రోడ్డు నిర్మించారు. దీనికి రోడ్డు మధ్యలో డివైడర్లు నిర్మించలేదు. ఖాళీ స్థలం వదిలి వేయడంతో ఆ స్థలంలో ప్రస్తుతం నీరు నిలిచి అపరిశుభ్రంగా మారింది.
అధికారుల నిర్లక్ష్యం.. పూర్తి కాని రోడ్ల నిర్మాణాలు
అధికారులు చేసే అడపాదడపా పనులకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. యర్రగొండపాలెంలో రోడ్లు వేసిన అధికారులు వాటికి తగిన డివైడర్లు, డ్రైనేజీ నిర్మాణాలను గాలికి వదిలేశారు.