ప్రకాశం జిల్లా చీరాల మండలం జాండ్రపేటకు చెందిన పద్మావతి అనే వృద్ధురాలు బియ్యం దుకాణం నిర్వహిస్తోంది. దుకాణంలో ఒంటరిగా ఉన్న ఆమెపై దుండగులు దాడిచేసి బంగారు గొలుసు, రెండు గాజులు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి షేక్ ఫయాజుద్దీన్తో పాటు ఓ బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి లక్షన్నర రూపాయలు విలువచేసే 52 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఫయాజుద్దీన్పై ఇదే తరహా కేసులు ఉన్నట్లు చీరాల ఒకటో పట్టణ సీఐ ఎన్. నాగమల్లేశ్వర రావు తెలిపారు.
ఇదీ చదవండి: