విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణికుల పట్ల గార్డ్ దురుసుగా ప్రవర్తించాడు. తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద రైలులో దివ్యాంగుల బోగి ఎక్కుతున్న ఓ కుటుంబాన్ని గార్డు అడ్డుకుని.. రైలు నుంచి నెట్టివేయడంతో మూడేళ్ల బాలుడు గాయపడ్డాడు. తల్లిదండ్రులు వెంటనే బాలుడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన ప్రయాణికులు... గార్డ్‌పై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీచదవండి