ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం వైదన గ్రామంలో పోతురాజు ఆలయానికి సంబంధించిన భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఒక వర్గం పోలీసుల పైకి తిరగపడడంతో కొంత మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు కొంత మంది పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ స్టేషన్‌కు వెళ్లి సీఐ అశోక్ వర్ధన్, ఎస్ఐ మహేష్, శివ నాంచారయ్యతో మాట్లాడారు. ఇరువర్గాలు ఘర్షణ దిగితే ఒక వర్గానికి చెందిన వారిని స్టేషన్‌కు తీసుకువచ్చి అన్యాయంగా కేసులు పెట్టవద్దన్నారు. వెంటనే తహసీల్దార్ మధుసూదన్ రావును స్థల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇదీ చదవండి...ఆర్డినెన్స్‌పై వ్యాజ్యాల్లో.. నేరుగా విచారణ