ప్రకాశం జిల్లా మార్టూరు మండలం రాజుపాలెం కూడలి వద్ద 16వ నెంబర్ జాతీయరహదారిపై జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతిచెందారు. యద్దనపూడి మండలం యనమదల గ్రామానికి చెందిన వల్లెపు బ్రంహం(72) కొటగిరి సాంబయ్య (75) ఇద్దరు మార్టూరు వెళ్లేందదుకు ద్విచక్రవాహనంపై బయలుదేరారు. రాజుపాలెం వద్ద హైదరాబాద్ నుంచి చెన్నై వెళుతున్న స్కార్పియో ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. ప్రమాదంలో వల్లెపు బ్రహ్మయ్య అక్కడికక్కడే మృతిచెందాడు. తీవ్రంగా గాయపడిన సాంబయ్యను హైవే అంబులెన్స్‌లో మార్టూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి... అక్కడి నుంచి మెరుగైన వైద్యంకోసం గుంటూరు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. మార్టూరు పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి: ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తా