couple died: ప్రకాశం జిల్లాలో మద్యం అనుకొని ఓ సీసాలో దొరికిన ద్రవాన్ని తాగిన ఘటనలో భార్యాభర్తలు మృత్యువాతపడ్డారు. నాగులుప్పలపాడు మండలం చింతగానిపాలెంలో చేపలు పట్టుకునే దంపతులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. సముద్రంలో ఓ సీసా కొట్టుకు రాగా.. దానిలో ఉన్న ద్రవం మద్యంగా భావించి సేవించారు. చింతగానిపాలెం వద్దకు వచ్చిన తరువాత వీరిద్దరూ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. భర్త కొద్దిసేపటికే కుప్పకూలిపోయి మరణించాడు. భార్యను స్థానికులు ఆసుపత్రికి తరలించగా, ఒంగోలు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.. వీరిద్దరూ ఏ గ్రామానికి చెందినవారనేది తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి:
AP HIGH COURT: రిషి కొండపై.. "వుడా" మాస్టర్ ప్లాన్ అమలు చేయాలి: హైకోర్టు