ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన ఇద్దరు యువకులు మద్యానికి బానిసలై ఆటోను చోరీ చేశారు. ఈ నెల 8న మార్కాపురం పట్టణంలో ఉమామహేశ్వరరావు అనే వ్యక్తికి చెందిన ఆటోను యువకులు చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులకు విచారణ చేపట్టారు. సోమవారం రాత్రి బోడపాడు అడ్డరోడ్డు వద్ద ఆటోలో ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో నిందితులు బొగ్గు శివసాయి రెడ్డి, పామూరి రుద్రేష్.. ఆటో దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. పోలీసులు వారి నుంచి ఆటోను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరిని కోర్టులో హాజరు పరచనున్నట్లు సీఐ రాఘవేంద్రరావు తెలిపారు.
ఇదీ చదవండి : లైవ్ వీడియో: మార్కెట్లో కారు బీభత్సం- ఇద్దరు మృతి