ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం అనంతవరం పొగాకు గోదాము అగ్నికి ఆహుతయ్యింది. మద్ది వెంకటసురేష్ బాబుకు చెందిన పొగాకు గ్రేడింగ్ పాయింట్ సమీపంలో గడ్డివాములో మంటలు చెలరేగాయి. పక్కనే ఉన్న పొగాకు గోదాముకు నిప్పంటుకుంది. ప్రమాదంలో 14 లక్షల రూపాయలు విలువచేసే పొగాకు కాలిపోయింది. చీరాల నుంచి వచ్చిన అగ్నిమాపక యంత్రం మంటలను అదుపులోకి తెచ్చింది.
![tobbacco godown fires and 14 lakhs rupees cost loss in ananthavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-ong-44-21-agnipramadam-pogaku-dagdham-ap10068_21052020172311_2105f_1590061991_952.jpg)
![tobbacco godown fires and 14 lakhs rupees cost loss in ananthavaram](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/ap-ong-44-21-agnipramadam-pogaku-dagdham-ap10068_21052020172311_2105f_1590061991_126.jpg)
ఇదీ చదవండి :