ETV Bharat / state

కనిగిరిలో నిలిచిన పొగాకు వేలం - కనిగిరిలో పొగాకు రైతుల నిరసన

ప్రకాశం జిల్లా కనిగిరి పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులు నిరసన చేశారు. కేంద్రం నెం.35 దగ్గర పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ బైఠాయించారు.

Tobacco  farmers protest at kanigiri auction Center
కనిగిరిలో పొగాకు రైతుల నిరసన
author img

By

Published : May 14, 2020, 9:40 AM IST

ప్రకాశం జిల్లా కనిగిరి పొగాకు వేలం కేంద్రం నెం.35 వద్ద రైతులు నిరసన చేశారు. పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. వేలంలో తక్కువ మంది కొనుగోలుదార్లు పాల్గొనడం వల్ల ధర తక్కువగా వస్తోందని.. తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన చెందారు.

తమకు గిట్టుబాటు ధర కల్పించేంతవరకు పొగాకు వేలం వేయనీయమని తేల్చి చెప్పారు. వేలానికి తీసుకొచ్చిన పొగాకు బేళ్లను వెనక్కి తీసుకెళ్తామన్నారు. మరోవైపు.. లాక్ డౌన్ కారణంగా. బయ్యర్లు పూర్తి స్థాయిలో వేలంలో పాల్గొనట్లేదని, ఈ కారణంగానే గిట్టుబాటు రావడం లేదని ఉన్నతాధికారులు చెప్పారు.

ఇదీ చూడండి:

చల్లగిరిలో వైకాపా కార్యకర్తల బాహాబాహీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.