Tipper lorry burnt: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం లక్ష్మీపురం సమీపంలో ప్రమాదం జరిగింది. ఓ టిప్పర్‌కు 11 కె.వి విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. దీంతో లారీ మంటల్లో దగ్ధమైంది.
స్థానికంగా ఓ బావిని పూడ్చేందుకు.. టిప్పర్‌లో మట్టిని తీసుకువెళ్లి అక్కడ నిలిపారు. ఈ క్రమంలో విద్యుత్ వైర్లు తగిలి షార్ట్ సర్క్యూట్ జరగటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటన జరిగిన సమయంలో లారీలో ఎవరూ లేకపోవడం వల్ల ప్రాణ నష్టం తప్పింది. అగ్నికి ఆహుతైన లారీ విలువ రూ.30 లక్షలకు పైగా ఉంటుందని లారీ యజమాని తెలిపారు.
ఇదీ చదవండి: