ప్రకాశం జిల్లాలో మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కలెక్టర్ పోలా భాస్కర్ తెలిపారు. చీరాలలో ఇద్దరికి, ఒంగోలులో ఒక కేసు నిర్ధారణ కావడంతో మొత్తం జిల్లాలో మూడు కొవిడ్-19 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు. కేసులు నమోదైన ప్రాంతం నుంచి 300 మీటర్లు హై సెన్సిటివ్ జోన్‌గా, మూడు కిలోమీట్లర్ల వరకు నిషేధిత ప్రాంతంగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. చీరాల, వేటపాలెం మండల ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ హెచ్చరించారు.
ఇవీ చూడండి...