ప్రకాశం జిల్లాలోని దొనుకొండలో అత్యధికంగా భూములు ఉన్నాయి. కొండలు, గుట్టలతోపాటు, నీరు లేక బీళ్ళుగా ఉన్న పొలాలు, దాదాపు 35వేల ఎకరాలుపైబడి ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. గత ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక కారిడార్‌గా అభివృద్ధి చేయాలని భావించింది. సూక్ష్మ ,చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం సుమారు 5వేల ఎకరాలతో ఓ పార్క్ ఏర్పాటు చేసింది. రాగమక్కపల్లి సమీపంలో శంకుస్థాపన చేశారు. మౌలిక వసతులు కోసం దాదాపు 8కోట్ల రూపాయలు మంజూరు చేసి... కాలువలు, రహదారుల నిర్మాణాలు ప్రారంభించారు. అయితే పనులు నత్తనడకగా సాగాయి. ఇంతలో ప్రభుత్వం మారే సరికి పనులన్నీ ఆగిపోయాయాని.
ఈ పారిశ్రమ కేంద్రంసహా దీనికి అనుకుని ఉన్న దాదాపు 23 వేల ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు సర్వం సిద్దమైనా నీటి వసతి సమస్యగా మారిందంటున్నారు స్థానికులు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తైతే నీరు వచ్చి పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
కొత్త ప్రభుత్వం ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడాలని గ్రామస్థులంతా ముక్తకంఠంతో కోరుతున్నారు.
ఇదీ చూడండి