ప్రకాశంజిల్లా దర్శి మండలం చందలూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. ఆసుపత్రిలో దొంగతనం జరిగిందని సిబ్బంది దర్శి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలానికి ఎస్సై ఆంజనేయులు పరిశీలించారు. దొంగలు ఆసుపత్రి ప్రధాన ద్వారం తలుపులు పగలగొట్టి లోపలికి చొరబడ్డారని పోలీసులు తెలిపారు. బీరువా పగలగొట్టినట్లు చెప్పారు. అయితే బీరువాలో ఏ ఫైల్స్ పోయాయో తెలియాల్సిఉందన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు విజయ్ కుమార్ మాట్లాడుతూ... ఎవరో కావాలని చేసిన పనిలా ఉందన్నారు.
ఆసుపత్రి సిబ్బంది, వైద్యులపై కోపంతో ఇలా చేసి ఉంటారని విజయ్ కుమార్ అన్నారు. ఏదైనా ఉంటే పైఅధికారులకు ఫిర్యాదుచేయాలి కానీ, ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం సరికాదన్నారు. ప్రభుత్వ వెంటనే ఆసుపత్రి చుట్టూ ప్రహరీ గోడ నిర్మించి వాచ్ మాన్ ను నియమించాలని కోరారు. నైట్ వాచ్ మెన్ లేకనే ఈ పరిస్తితి నెలకొందన్నారు. జిల్లా క్లూస్ టీం వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించింది. దర్శి ఎస్సై ఆంజనేయులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి : సీఎం నిర్ణయాలను ప్రశ్నించే స్థాయిలో నేను లేను: ఆర్టీసీ ఎండీ