ETV Bharat / state

ముస్లిం బాలిక... శ్లోకాల గీతిక..! - భగవద్గీత శ్లోకాలు

ఆ చిన్నారి ముస్లిం. అయినా భగవద్గీత పఠనంపై ఆసక్తి పెంచుకుంది. శ్లోకాలను అనర్గళంగా చెప్పేస్తూ బహుమతులు సొంతం చేసుకుంటోంది. మత పెద్దలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా... బాలిక తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తెను ప్రోత్సహిస్తున్నారు.

muslim girl
muslim girl
author img

By

Published : Jan 29, 2020, 8:35 AM IST

ముస్లిం బాలిక.... శ్లోకాల గీతిక

ప్రకాశం జిల్లా పొదిలిలోని ఇస్లాంపేటకు చెందిన సెలీనా ముస్లిం బాలిక. భగవద్గీత శ్లోకాలను అనర్గళంగా చెప్పేస్తోంది. సెలీనా మొదట్లో తన తోటి విద్యార్థిని భగవద్గీత శ్లోకాలు పఠనం చేస్తున్నపుడు ఆసక్తిగా వింటూ ఉండేది. అనంతరం తన స్నేహితురాలి వద్ద శ్లోకాలు నేర్చుకోవడం మొదలుపెట్టింది. ప్రస్తుతం వాటిపై పట్టు సాధించింది. సుమారు వంద శ్లోకాల వరకు అనర్గళంగా చెప్పగలదు.

భగవద్గీత కంఠస్త పోటీల్లో రెండుసార్లు విజేతగా నిలిచింది సెలీనా. ఇటీవల జిల్లా, మండలస్థాయిల్లో జరిగిన పోటీల్లోనూ రెండుసార్లు ద్వితీయ స్థానాన్ని సాధించింది. గీతలోని శ్లోకాలను సెలీనా చదువుతుంటే ముస్లిం మతపెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ బాలిక తల్లిదండ్రులు మాత్రం... తమ కూతురి ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించారు. మంచి గురువులు వద్ద శిక్షణ తీసుకుంటే ఇంకా బాగా రాణిస్తానంటోంది ఈ చిన్నారి.

ఇదీ చదవండి:సెల్ఫీ అడిగితే ఫోన్​ లాగేసుకున్న సల్మాన్

Intro:AP_ONG_51A_13_MUSLIM_BALIKA_SLOKALA_GETHIKA_AVB_AP10136.

సార్ ముస్లిం బాలిక - శ్లోకాల గీతిక ఫైల్ రాత్రి పంపాను. ఆ ఫైల్ యొక్క స్క్రిప్ట్ ని ఈ ఫైల్ కు ఉపయోగించుకోగలరు.

Body:ప్రకాశంజిల్లా దర్శి.

Conclusion:కొండలరావు దర్శి.9848450509.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.