హైకోర్టును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించటమే కాకుండా..విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ప్రకాశం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్ రత్నావళిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. వైద్యాధికారి జారీ చేసిన ధ్రువపత్రం ఆధారంగా తాను పొందుతున్న పింఛన్‌ను ఏకపక్షంగా రద్దు చేశారని ప్రకాశం జిల్లాకు తర్లపాడుకు చెందిన వెంకటేష్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ బట్టు దేవానంద్ విచారణ జరిపారు. తుది ఉత్తర్వులను ఈ నెల 16న జారీ చేశారు. పింఛన్ రద్దు ఉత్తర్వులు తనకు తెలియదని రత్నావళి పేర్కొంటూ.. కోర్టును పక్కదోవ పట్టించేందుకు ప్రయత్నించారని న్యాయమూర్తి తప్పుపట్టారు. విధుల నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకుని.. ఆ వివరాలను కోర్టుకు నివేదించాలని వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేశారు.
ఇదీ చదవండి: రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు ఆగ్రహం... ఎందుకంటే..?