ప్రకాశంజిల్లా పర్చూరులో అభయాంజనేయస్వామి విగ్రహ శంకుస్థాపన మహోత్సవం వైభవంగా జరిగింది. పర్చూరు నుంచి చిలకలూరిపేట, గుంటురు రోడ్డులోని వై జంక్షన్ వద్ద 72 అడుగుల శ్రీ అభయాంజనేయ విగ్రహం ప్రతిష్టంచనున్నారు. ఇందు కోసం జరిపిన శంకుస్థాపన కన్నులపండువగా సాగింది. డప్పువాయిద్వాలు, దేవతామూర్తుల వేషధారణలు, కోలాటాల నడుమ 108 కలశాలతో మహిళలు ఊరేగింపుగా వెళ్లి జలాభిషేకం నిర్వహించారు. అనంతరం ఉదయం 11 గంటల 9 నిమిషాలకు శంకుస్థాపన పూర్తైంది.
74 అడుగుల అభయాంజనేయస్వామి విగ్రహానికి అయ్యే మెుత్తం సొమ్మును పర్చూరు మండలం నూతలపాడు గ్రామానికి చెందిన ప్రవాసభారతీయుడు చిమటా శ్రీనివాసరావు, మాధవి దంపతులు సమకూరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో పర్చూరు నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి రావిరామనాథం బాబు దంపతులు పాల్గొని ఒక లక్షరూపాయలు విరాళం ప్రకటించారు.
ఇదీ చదవండీ...అమరావతిలోనే రాజధాని ఉండాలి: సోము వీర్రాజు