వివాహేతర సంబంధానికి అడ్డుతగులుతున్నాడని మామను హతమార్చలనుకుంది ఓ ప్రబుద్ధురాలు. ప్రకాశం జిల్లా ఉప్పుటూరుకు చెందిన రుక్సానా... మస్తాన్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలిసిన మామ పలుమార్లు తప్పని హెచ్చరించాడు. దీనిపై ఆగ్రహించిన ఆమె... మామపై క్షక్ష పెంచుకున్న నిందితురాలు ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలనుకుంది. ప్రియుడు మస్తాన్తో కలిసి హత్యకు పథకం రచించింది. మామ ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తాడును గొంతు చుట్టూ బిగించి దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేసింది. వారి నుంచి తప్పంచుకొన్న బాధితుడు స్థానికుల సహయంతో చీరాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఇదీచదవండి