ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ప్రకాశం జిల్లా ఒంగోలులో బీటెక్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకుందని తెదేపా మహిళా నేత పద్మజ ఆరోపించారు. పాదయాత్రలో జగన్ ఇచ్చిన ఫీజు రీయింబర్స్మెంట్ హామీలను అమలుపరచడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సొంత జిల్లాలో ఇలాంటి ఘటన జరగటం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, రూ.10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
మదనపల్లెలో యోగశాల, భారత్ యోగా కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి