ETV Bharat / state

TS LETTER TO CENTRAL: వెలిగొండకు కేంద్రం నిధులపై తెలంగాణ అభ్యంతరం - velugonda project latest updates

veligonda
veligonda
author img

By

Published : Aug 27, 2021, 12:14 PM IST

Updated : Aug 27, 2021, 12:43 PM IST

12:13 August 27

వెలిగొండ ప్రాజెక్టుకు అర్హత ఉందో లేదో పరిశీలించాలని విజ్ఞప్తి

రాష్ట్రంలో చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ఏఐబీపీ కింద నిధులు ఇచ్చే విషయమై పునరాలోచించాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖలోని స్టేట్ ప్రాజెక్ట్స్ వింగ్ కమిషనర్​కు నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. వరద జలాల ఆధారంగా కృష్ణానదిపై ఏపీ చేపట్టిన వెలిగొండ ప్రాజెక్టుకు ట్రైబ్యునల్ కేటాయింపులు లేవని లేఖలో పేర్కొన్నారు.  

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన కేఆర్ఎంబీ గెజిట్ నోటిఫికేషన్​లోనూ.. అనుమతుల్లేని వాటి జాబితాలో వెలిగొండ ప్రాజెక్టు ఉందని తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్.. కృష్ణా జలాలను బేసిన్ వెలుపలకు తరలిస్తోందని గతంలోనే ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అనుమతుల్లేని ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఏఐబీపీ కింద నిధులు ఇవ్వడం ఏ మేరకు సబబన్న తెలంగాణ.. పీఎంకీఎస్​వై-ఏఐబీపీ కింద నిధులు ఇచ్చేందుకు వెలిగొండ ప్రాజెక్టుకు అర్హత ఉందో లేదో పరిశీలించాలని కోరింది.

ఇదీ చదవండి: ఏడు ట్రక్కులకు నిప్పు- ఐదుగురు సజీవదహనం

Last Updated : Aug 27, 2021, 12:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.