ఒంగోలులో...
ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంది. మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ పలు డివిజన్‌ల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. వైకాపా పాలనలో పట్టణంలో ఏ ఒక్క పని చేయలేదని, సమస్యలు తీవ్ర రూపం దాల్చుతున్నా పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు.
ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల్లో వైకాపాకు చెందిన వారు పార్టీ ఆదేశాలను కాదని, స్వతంత్ర అభ్యర్థుల తరఫున ప్రచారం చేస్తున్నారని సింగరాజు వెంకట్రావు అన్నారు. అటువంటి వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకొని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు.
అద్దంకిలో...
ప్రకాశం జిల్లా అద్దంకి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పట్టణంలోని 12వ వార్డులో ఉత్కంఠ పోరు నెలకొంది. తెదేపా తరఫున మాజీ ఉపసర్పంచ్ అత్తులూరి రమేష్ పోటీ చేస్తుండగా... వైకాపా తరఫున వ్యాపారి వుడత్తు సురేష్ బరిలో ఉన్నారు. గతంలో ఈ వార్డు నుంచి గెలిచినవారు వైస్ ఛైర్మన్గా పనిచేయడంతో నాయకుల దృష్టి ఈ వార్డుపై పడింది.
చీరాలలో...
చీరాల పదో వార్డులో వైకాపా అభ్యర్థి కర్నేటి వెంకటరత్నంను గెలిపించాలని కోరుతూ... మాజీఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ ప్రచారం చేశారు. తనను గెలిపిస్తే వార్డును అభివృద్ధి చేస్తానని 17వ వార్దు కౌన్సిలర్ అభ్యర్థి బాలకృష్ణ భారీ ర్యాలీ నిర్వహించి ఓటర్లను అభ్యర్ధించారు.
ఇదీచదవండి.