ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గం పరిధిలో జీప్లస్ 2 ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలని తెదేపా నిరసన వ్యక్తం చేసింది. లబ్ధిదారులకు ఇళ్లు కేటాయించాలంటూ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేశారు. గత ప్రభుత్వం హయంలో 4200 మందికి ఇళ్ల నిర్మాణం కోసం నిధులు మంజూరుచేసి నిర్మాణాలు పూర్తి అయ్యాయని గుర్తు చేశారు.
ఇందులో 1400 మంది లబ్ధిదారులకు చివరి బిల్లు చెల్లించడంలో నిర్లక్ష్యం చూపుతున్నారని పేర్కొన్నారు. జీప్లస్ 2 అపార్టుమెంట్లు కూడా చాలా వరకూ పూర్తయినా వాటిని అందించడంలేదని అన్నారు. వీటిలో లబ్ధి దారుల పేర్లు మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. తక్షణం పాత బిల్లులు చెల్లించి, ఇళ్లను లబ్దిదారులకు అప్పగించాలన్నారు.
ఇదీ చూడండి: