ETV Bharat / state

మహానాడు గ్రాండ్ సక్సెస్.. ఆ విషయం తేలిపోయింది : తెదేపా - tdp leaders thanked all those who made Mahanadu success

వైకాపా నాయకులు ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. మహానాడును ప్రజలు విజయవంతం చేశారని తెదేపా నేతలు తెలిపారు. మహానాడు నిర్వహణకు స్థలమిచ్చిన మండువవారిపాలెం రైతులకు కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలులో నిర్వహించిన మహనాడు చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుందని పేర్కొన్నారు.

tdp
tdp
author img

By

Published : May 29, 2022, 5:17 PM IST

చంద్రబాబును ఎప్పుడెప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా లెక్కచేయకుండా ప్రజలు స్వచ్ఛందంగా మహానాడుకు తరలివచ్చారని చెప్పారు. వైకాపా ప్రభుత్వంపై యువత, మహిళల్లో తిరుగుబాటు మొదలైందని.. నిన్నటి సభతో ఆ విషయం రూఢీ అయిందని అన్నారు. మహానాడును విజయవంతం చేసిన వారందరికీ పార్టీ తరఫున అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు చెప్పారు. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారంటూ ఉమ్మడి ప్రకాశం జిల్లా తెలుగుదేశం నాయకులను అభినందించారు. మహానాడు నిర్వహణకు స్థలమిచ్చిన మండువవారిపాలెం రైతులకు పాదాభివందనం చేస్తున్నట్లు చెప్పారు.

మహానాడుపై విజయంపై.. తెదేపా నేతలు ఏం అన్నారంటే..

ఎన్ని అడ్డంకులు సృష్టించినా: ఒంగోలులో నిర్వహించిన మహానాడు విజయవంతం కావటంతో.. వైకాపా నాయకులకు మింగుడు పడటంలేదని తెదేపా మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మండిపడ్డారు. బస్సులు ఆపించినా, టైర్లలో గాలి తీయించినా సభ విజయవంతం కావడం.. మహానాడు వేదికగా తెదేపా నాయకులు ప్రశ్నించడంతో.. ఫ్రస్టేషన్లో మంత్రులు, జిల్లా నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.

మంత్రి రోజాకు సవాల్ : మంత్రి రోజా అత్యాచార ఘటనలపై అవగాహనరాహిత్యంతో మాట్లాడుతున్నారని వంగలపూడి అనిత అన్నారు. రోజా మంత్రిగా కాకుండా నటిగానే మాట్లాడుతున్నారు. ఆమె ఇంకా సంపూర్ణ రాజకీయ నాయకురాలిగా మారలేదన్నారు. రోజా తీరుచూస్తుంటే.. మంత్రిగా అర్హురాలేనా? అని సందేహం కలుగుతోందన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై నగరిలోనైనా, పర్యాటకశాఖ కార్యాలయంలోనైనా.. విజయవాడలోనైనా.. ఎక్కడైనా చర్చకు సిద్ధమా? అని అనిత సవాల్ విసిరారు. మంత్రి రోజా తీరుకు నిరసనగా ఆమెను అడ్డుకుంటామన్నారు.

మహానాడు చరిత్రలో నిలిచిపోతుంది: వైకాపా ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టించినా.. మహానాడు కార్యక్రమంను విజయవంతం చేసిన ప్రజలకు, కార్యకర్తలకు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర కృతజ్ఞతలు తెలిపారు. ఒంగోలులో నిర్వహించిన మహనాడు చరిత్రలో ఎప్పటికి నిలిచిపోతుందని పేర్కొన్నారు. కృష్ణాజిల్లా గన్నవరంలో వల్లభనేని వంశీ.. నందమూరి తారక రామారావు విగ్రహానికి అడ్డంగా ఫ్లెక్సీలు కట్టి ఆయన మొహాన్ని కనబడకుండా చేశారని కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఎన్టీఆర్ విగ్రహానికి అడ్డంగా డయాస్ కట్టిన వంశీ చరిత్రహీనుడుగా మిగిలిపోతాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేట్లు కట్టి ఎంపీ టికెట్లు అమ్ముకునే జగన్.. సామాజిక న్యాయం గురించి మాట్లాడతారా? అని విమర్శించారు. వైకాపా అంబోతులు బస్సులెక్కి రంకెలేస్తున్నాయని ధ్వజమెత్తారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.