ETV Bharat / state

TDP Leaders Bus Yatra: "దూసుకుపోతున్న టీడీపీ బస్సుయాత్ర.. మినీ మేనిఫెస్టోతో వైఎస్సార్సీపీ నాయకుల్లో వణుకు" - భవిష్యతుకు హామీ ఎన్నికల మ్యానిఫెస్టో

TDP Leaders Bus Yatra: 'భవిష్యత్తుకు గ్యారెంటీ' పేరుతో టీడీపీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర ప్రారంభం అయినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతోంది. మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటింటిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి పార్టీ శ్రేణులు తీసుకెళ్తున్నారు. అలాగే ఈ యాత్రలో వైఎస్సార్​సీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను ఎక్కడికక్కడ ప్రజలకు తెలియజేస్తూ ముందుకు సాగుతున్నారు.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jun 28, 2023, 2:08 PM IST

TDP Leaders Bus Yatra : అవినీతి, అక్రమ దాడులు, అఘాయిత్యాలే తప్ప ఉపాధి, అభివృద్ధి ఊసే లేని వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడితేనే రాష్ట్రానికి భవిష్యత్‌ ఉంటుందని.. టీడీపీ నేతలు భవిష్యత్‌కు గ్యారెంటీ బస్సు పేరుతో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. వైఎస్సార్సీపీ పాలనలో అన్ని విధాల నాశనమైన రాష్ట్రాన్ని గాడిన పెట్టాలంటే, అభివృద్ధి పథంలో నడిపించాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు సీఎం కావాలంటూ ప్రజలకు అవగాహన కల్పిస్తూ టీడీపీ నేతలు ముందుకు సాగుతున్నారు. మహానాడు వేదికగా చంద్రబాబు ప్రకటించిన మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు.

పేదవాడు ధనికుడిగా కావాలంటే టీడీపీ ప్రభుత్వం రావాలి : ప్రకాశం జిల్లా కనిగిరి మండలం శంకవరం గ్రామంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా టీడీపీ నేత ఉగ్ర నరసింహారెడ్డి, పార్టీ శ్రేణులు గ్రామంలో పర్యటించారు. ఉగ్ర నరసింహారెడ్డి వీధి వీధి తిరుగుతూ స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంఖవరం గ్రామస్ధులు తమ సమస్యలను ఉగ్ర దృష్టికి తీసుకెళ్లారు.పేదల కోసమే జగనన్న ప్రభుత్వమని మోసపు మాటలు చెప్పి.. అధికారం వచ్చిన తరువాత పేదవాడిని మరింత పేదవాడిగా మార్చారని ఆయన ఆరోపించారు. పేదవాడు ధనికుడిగా కావాలంటే ఒక్క టీడీపీతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. 2024 లో టీడీపీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే తమ సమస్యలను కచ్చితంగా పరిష్కరిస్తామని ఉగ్ర నరసింహ రెడ్డి గ్రామస్థులకు హామీ ఇచ్చారు.

సెల్ఫీ ఛాలెంజ్‌ : 'భవిష్యత్తుకు గ్యారెంటీ'లో పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల మండలం జూలకల్లు నుంచి టీడీపీ నాయకులు బస్సు యాత్ర ప్రారంభించారు. బస్సు యాత్రను ప్రారంభించిన యరపతినేని, జీవీ, జూలకంటి సెల్ఫీ ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. జలకల నుంచి ర్యాలీతో పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నాయకులు బస్సు యాత్రలో పాల్గొన్నారు.

టీడీపీ అధికారంలోకి రావాలని నినాదాలు : అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలో బస్సు యాత్రకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. 'భవిష్యత్తుకు గ్యారెంటీ' కార్యక్రమంలో ఆ జిల్లాల అధ్యక్షులు కాలవ శ్రీనివాసులు, పార్థసారథి, మాజీ మంత్రి పరిటాల సునీత పాల్గొన్నారు. బస్సును అనుసరిస్తూ వందలాది వాహనాలు బయలుదేరాయి. హిందూపురంలో కూడా టీడీపీ శ్రేణులు భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. పట్టణంలోని చౌడేశ్వరి కాలనీలో శ్రేణులు ఇంటింటికి తిరిగి ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలన గురించి వివరించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. నారా చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మినీ మేనిఫెస్టో గురించి ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే టీడీపీ అధికారంలోకి రావాలంటూ నినాదాలు చేశారు.

మినీ మేనిఫెస్టోతో వైఎస్సార్సీపీ నాయకుల్లో వణుకు : 'భవిష్యత్తుకు గ్యారెంటీ' బస్సు యాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామ కూడలిలో గ్రామస్థులతో కలిసి రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజమహేంద్రవరంలో జరిగిన మహానాడులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టో అంశాలపై ప్రజలతో చర్చించి.. మేనిఫెస్టో అంశాల్లోని విషయాలను నాయకులు ప్రజలకు వివరించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రకటించిన మినీ మేనిఫెస్టోతో వైఎస్సార్సీపీ నాయకుల్లో వణుకు పుడుతుందని చెప్పారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన పథకాలను ప్రజలకు చేరువయ్యేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలను పరిశీలించాలని, వివిధ నిబంధనల పేరుతో ఎంతో మంది లబ్ధిదారులు అన్యాయమైపోతున్నారని వారు అన్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.