అమరావతికి మద్దతుగా తెదేపా, సీపీఐ ర్యాలీ - tdp, cpi ryali in prakasam district
అమరావతి రాజధానికి మద్దతుగా ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో తెదేపా, సీపీఐ అధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి... పట్టణంలోని ప్రధాన రహదారి మీదుగా నల్ల జెండాలతో ర్యాలీ చేపట్టారు. సీఎం జగన్ ఏకపక్షంగా రాజధానిని మార్చాలనుకోవడం సబబు కాదని హితవుపలికారు. అన్ని ప్రాంతాల వారికి అనుకూలంగా ఉన్న అమరావతినే రాష్ట్ర రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.
రాజధానికి మద్దతుగా తెదేపా, సీపీఐ ర్యాలీ
sample description