ప్రకాశం జిల్లా కనిగిరిలో స్థానిక తెదేపా మాజీ శాసన సభ్యులు డా.ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ... రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల ప్రతిపాదనను నిరసిస్తూ...భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ కనిగిరిలోని ప్రధాన వీధుల గుండా నినాదాలతో హోరెత్తుతూ సాగింది. ప్రజలు భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు, ధర్నాలు చేపడుతున్నా... ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టించుకోవటం లేదని డా.ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి విమర్శించారు. విశాఖ ప్రజలు సైతం మూడు రాజధానులను వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు.
ఇవీ చదవండి...'ఈ నెల 20 వరకు అభ్యంతరాలు తీసుకోండి- సీఆర్డీఏకు హైకోర్టు ఆదేశం '