ETV Bharat / state

Tamilnadu Man Kanyakumari to South Korea Solo Cycle Trip: పర్యావరణ పరిరక్షణ కోసం.. యువకుడి ప్రపంచ యాత్ర - ఏపీ సైకిల్ యాత్ర న్యూస్

Tamilnadu Man Kanyakumari to South Korea Solo Cycle Trip : పర్యావరణ పరిరక్షణే అతని ధ్యేయం. కర్బన ఉద్గారాలను తగ్గించడమే అతడి లక్ష్యం. అందుకోసం ఎంతవరకైనా వెళ్లడానికి సిద్ధం. ఇదీ.. ఓ యువకుడికి పర్యావరణంపై ఉన్న మక్కువ. ఉద్యోగానికి స్వస్తి పలికి.. పర్యావరణ పరిరక్షణ కోసం ఏకంగా ప్రపంచ యాత్రను మెుదలుపెట్టాడు. దారిలో కలిసే ప్రజలకు ప్రకృతిపై అవగాహన కల్పిస్తూ ముందుకు సాగుతున్నాడు. మరి, ఆ యువకుడు ఎవరూ..? ఏంటా యాత్ర..? ఇప్పుడు చూద్దాం.

Kanyakumari_to_South_Korea_Solo_Cycle_Trip

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2023, 7:15 PM IST

Tamilnadu Man Kanyakumari to South Korea Solo Cycle Trip: పర్యావరణ పరిరక్షణ కోసం.. యువకుడి ప్రపంచ యాత్ర

Tamilnadu Man Kanyakumari to South Korea Solo Cycle Trip : పెరిగిపోతున్న కాలుష్యం వల్ల కలిగే చెడు ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఓ యువకుడు సైకిల్‌ యాత్ర చేపట్టాడు . ఉద్యోగానికి స్వస్థి పలికి ఏకంగా 12 దేశాలను చుట్టేందుకు పయనమయ్యాడు. మార్గమధ్యలో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ స్నేహితులను కలుస్తూ వారి సహకారంతో ముందుకు సాగుతున్నాడు. అలా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోకి(Reaches AP) ఈ యువకుడు సైకిల్‌ యాత్ర చేరుకుంది.

తమిళనాడుకు చెందిన ఈ యువకుడి పేరు శ్రీనాభన్‌. హోటల్‌ మేనేజ్‌మెంట్‌ చదువుకుని, ముంబయిలో ఓ సంస్థలో ఉద్యోగం చేస్తుండేవాడు. పర్యావరణం మీదున్న మక్కువతో ఉద్యోగాన్ని వదిలేసి ప్రజలకు అవగాహన కల్పించేందుకు సైకిల్‌ యాత్రకు సిద్ధమయ్యాడు. 72 వేల కిలోమీటర్ల ప్రయాణానికి తమిళనాడు నుంచి శ్రీకారం చుట్టాడు. అలా జూన్‌ 3న తన ప్రయాణాన్ని మొదలు పెట్టాడు శ్రీనాభన్‌. తమిళనాడు నుంచి ప్రారంభమైన సైకిల్‌ యాత్ర.. పల్లెలు, పట్టణాలను దాటుకుంటూ సాగుతోంది. మార్గమధ్యలో విద్యార్థులను, పర్యావరణ వేత్తలను కలుస్తూ తన ఆశయాలను గురించి వివరిస్తున్నాడు శ్రీనాభన్‌. పెట్రోల్‌, గ్యాస్‌, డీజిల్‌ నుంచి వచ్చే కర్బన ఉద్గారాల(carbon emission) వల్ల పర్యావరణానికి నష్టం వాటిల్లుతుందని.. వాటిని అరికట్టాలని కోరుతున్నాడు.

Soft Tennis Player Surya Akash Wins Silver Medal: సూర్య ఆకాశ్ సాఫ్ట్‌ టెన్నిస్‌లో పతకాల పంట.. ఎందరో యువకులకు స్ఫూర్తి

Sreenabhan Adventurous Cycle Tour : భారత్‌తో పాటు నేపాల్‌, భూటాన్‌, చైనా , మయన్మార్‌, సింగపూర్, హాంకాంగ్‌తో పాటు పలు దేశాలు మీదుగా దక్షిణ కొరియాకు చేరుకునేలా రూట్‌ మ్యాప్‌ సిద్ధంచేశాడు. నాలుగేళ్ల పాటు కొనసాగే ఈ యాత్రలో.. దక్షిణ కొరియాకు మాత్రం ఓడ మీదుగా చేరుకుంటానని మిగతా దేశాలకు సైకిల్ పైనే చేరుకుంటానని చెబుతున్నాడు శ్రీనాభన్‌. గ్రామల నుంచి సాగుతున్న ఈ యాత్రలో వివిధ వర్గాల నుంచి విశేష స్పందన వచ్చిందని అంటున్నాడు.

నేను కన్యాకుమారి నుంచి దక్షిణ కొరియా వరకు సైకిల్ యాత్ర ప్రారంభించాను. నా యాత్ర మొత్తం 72 వేల కిలోమీటర్లు, 12 దేశాల మీదుగా సాగుతుంది. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్​లో ఉన్నాను. సుమారు 1000 కిలోమీటర్ల వరకు ప్రయాణించాను. నా నినాదం కర్బన ఉద్గారాల పట్ల పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన కల్గించటం. అలాగే ప్రజలతో కూడా దీని గురించి మాట్లాడుతున్నాను. ఈ నినాదంతో ఒక పుస్తకం రాస్తున్నాను. అది పూర్తవడానికి నాలుగు నెలల సమయం పడుతుంది. -శ్రీనాభన్‌ , ప్రపంచ యాత్రికుడు

తండ్రి కళ్లలో ఆనందం కోసం.. సరికొత్త యంత్రాన్ని ఆవిష్కరించాడో కుమారుడు

ఇన్​స్టాగ్రామ్ స్నేహితుడి ఇంటిలో బస.. Reaches Andhra Pradesh : సైకిల్‌ యాత్రలో భాగంగా రోజుకి 100నుంచి 200 కిలోమీటర్లు సైకిల్‌ తొక్కుతున్నాడు. రాత్రిళ్లు తనకు అనుకూలంగా ఉన్న ప్రదేశాల్లో బస చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ప్రకాశం జిల్లా ఒంగోలు మీదుగా వెళ్తున్న అతనికి మార్గ మధ్యలో సంతనూతలపాడు మండలం రుద్రవరం వద్ద ఇన్‌స్టాగ్రామ్‌ స్నేహితుడు. సైకిల్‌ యాత్రికుడైన సుభాష్‌చంద్రబోస్‌ తన ఇంట్లో బస చేసేందుకు శ్రీనాభన్‌ని ఆహ్వానించాడు. కర్బన ఉద్గారాల వల్ల భూతాపం పెరిగి నీరు సైతం కలుషితంగా మారే అవకాశం ఉందని చెబుతున్నాడు చంద్రబోస్‌. తద్వారా భవిష్యత్‌లో పేదలకు నీరు అందకపోవచ్చని అంటున్నాడు. చిన్న వయస్సులోనే ఇంతటి యాత్ర చేయాలంటే ఎంతో గుండె ధైర్యం కావాలని శ్రీనాభన్‌ను చంద్రబోస్ అభినందించాడు.

ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించడం ఎంతో ఆనందంగా ఉందనంటున్నాడు శ్రీనాభన్‌. తాను పొదుపు చేసుకున్న డబ్బులతో పాటు మిత్రులు, పర్యావరణ వేత్తలు అందిస్తున్న సహాయంతో ముందుకు సాగుతున్నానని చెబుతున్నాడు. భవిష్యత్‌లో ప్రతి ఒక్కరూ ప్రకృతిని పరిరక్షించేలా చర్యలు చేపట్టాలని.. అప్పుడే ప్రకృతి మనల్ని కాపాడుతుందని అంటున్నాడు శ్రీనాభన్‌.

One Crore Schorship: ఔషధాలపై అధ్యయనం.. ఆ యువతికి అమెరికా వర్సిటీ రూ.కోటి స్కాలర్​షిప్ ఆఫర్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.