ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలంలో.. తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, వీఆర్ఓలను జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేశారు. మండలంలోని హాజీపురం రెవిన్యూలో.. 5 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ కు సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెలుగులోకి రావడంతో సదరు సిబ్బందిపై.. సుమారు 20 రోజుల క్రితం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేపట్టారు. ఇందులో భాగంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న తహసీల్దార్ సుధాకర్ రావు డిజిటల్ సిగ్నేచర్‌ను జిల్లా కలెక్టర్ నిలుపుదల చేశారు. అనంతరం విచారణ అధికారులను నియమించారు.
విచారణ అనంతరం తహసీల్దార్ సుధాకర్ రావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ ప్రసాద్, వీఆర్ఓ నరసింహులును.. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా సస్పెండైన తహసీల్దార్ ఈ రోజే పదవీ విరమణ చేయాల్సి ఉండడం గమనార్హం. సస్పెండైన తహసీల్దార్ స్థానంలో.. కనిగిరి తహసీల్దార్ పుల్లారావుకు హనుమంతునిపాడు మండల ఇంఛార్జ్ తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు.
ఇదీ చదవండి:
Kidnap: కుమారుడినే కిడ్నాప్ చేసిన తండ్రి..చివరికి ఏం జరిగిందంటే !