ప్రకాశం జిల్లాలో మొట్టమొదటిసారిగా ఒంగోలులోని ఓ ఆస్పత్రిలో క్లిష్టతరమైన చిన్నపిల్లల గుండె సంబంధిత శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. చెన్నై, హైదరాబాద్, విజయవాడ వంటి నగరాలకే పరిమితమైన శస్త్రచికిత్సలను... ఇప్పుడు ఒంగోలులో అందుబాటులోకి తెచ్చామని హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ తిరుమల రెడ్డి అన్నారు. పెద్దలలో వచ్చే గుండె జబ్బుల చికిత్స కంటే చిన్నపిల్లల్లో వచ్చే గుండె వ్యాధులకు చికిత్స చేయడం చాలా క్లిష్టమైన ప్రక్రియ అని తెలిపారు.
సీనియర్ శస్త్ర చికిత్స వైద్యనిపుణులు డాక్టర్ బెనెడిక్ట్ రాజ్ నేతృత్వంలో... డాక్టర్ రజనీ నల్లూరి, డాక్టర్ సుధీర్, చిన్నపిల్లల గుండెవ్యాధి నిపుణులు డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి, డాక్టర్ జ్యోతి ప్రకాష్, డాక్టర్ వాసుదేవ్లతో కూడిన వైద్య బృందం 10 డివైజ్ క్లోజర్, 10 శస్త్ర చికిత్సలను విజయవంతంగా నిర్వహించారు.
ఇదీచదవండి.