ETV Bharat / state

ఆన్​లైన్​ పరీక్షలు బహిష్కరించిన విద్యార్థులు

ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, చీరాల సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పరీక్షలను బహిష్కరించి నిరసన తెలిపారు. ఇప్పటివరకూ ఆఫ్​లైన్​లోనే పరీక్షలు రాశామని... ఇప్పటికిప్పుడు ఆన్​లైన్ పరీక్షలకు సిద్ధంకండి అంటే ఎలాగని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.

ఆన్​లైన్​ పరీక్షలు బహిష్కరించిన విద్యార్థులు
ఆన్​లైన్​ పరీక్షలు బహిష్కరించిన విద్యార్థులు
author img

By

Published : Jan 28, 2021, 5:48 PM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం ఈపురుపాలెం ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్, చీరాల సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కళాశాలల విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారు. ఈపురుపాలెంలో 14 మంది, సెయింట్ ఆన్స్​లో 70 మంది విద్యార్థులు ఆన్​లైన్ పరీక్షలను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ ఆఫ్​లైన్​లోనే పరీక్షలు రాశామని... ఇప్పటికిప్పుడు ఆన్​లైన్ పరీక్షల అంటే ఎలాగని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు కంప్యూటర్ పరిజ్ఞానం తక్కువ ఉన్నందున పరీక్షలు రాయలేమని తేల్చి చెప్పారు.

పరీక్షల నోడల్ ఆఫీసర్ రామకృష్ణ మాట్లాడుతూ.. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామని...ఆఖరి నిమిషంలో విద్యార్థులు పరీక్షలను బహిష్కరించారని వివరించారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.

ఇదీచదవండి

రేపు, ఎల్లుండి రాష్ట్రంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ పర్యటన

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.