ప్రకాశం జిల్లా మార్టూరులోని ఓ విద్యాసంస్థ వసతి గృహంలో.. నీటికుంటలో ఈతకు వెళ్లిన మేకల శామ్యూల్ అనే విద్యార్థి మరణించాడు. ఆదివారం కావడంతో తొమ్మిదో తరగతికి చెందిన నలుగురు విద్యార్థులు సరదాగా ఈతకొట్టేందుకు కొలనులోకి దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో మునిగిపోతున్న విద్యార్థులను.. స్థానికంగా ఉన్న ఉపాధ్యాయుడు కాపాడారు.
శామ్యూల్ (15) అపస్మారకస్థితిలో ఉండటంతో ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో ప్రాణాలు విడిచాడు. మృతుడి స్వగ్రామం బల్లికురవ మండలం వైదనగుడిపాడు. తండ్రి అనారోగ్యంతో గతేడాది మృతి చెందగా.. తల్లి అదే పాఠశాలలో ఆయాగా పని చేస్తోంది.
ఇదీ చదవండి: