ETV Bharat / state

లాక్ డౌన్ సడలింపు.. దుకాణాల పునఃప్రారంభం

author img

By

Published : May 29, 2020, 4:28 PM IST

ఒంగోలులో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో లాక్ డౌన్ సడలించి అనుమతులు ఇచ్చారు. దీంతో రెండు నెలలు తరువాత దుకాణాలు తెరుచుకున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దాదాపు అన్ని రకాల దుకాణాలు తెరిచేందుకు అధికారులు అనుమతించారు.

praksam district
లాక్ డౌన్ సడలింపు.. దుకాణాలు పునఃప్రారంభం

ప్రకాశం జిల్లాలో లాక్​డౌన్​లో మినహాయింపులు ఇవ్వటంతో దుకాణాలు తెరుచుకున్నాయి. జిల్లా కేంద్రం ఒంగోలులులో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువుగా ఉండటం వల్ల ఇన్ని రోజులు నిబంధనలు కఠినంగా అమలు చేశారు. ఉదయం 6గంటల నుంచి 9 వరకు మాత్రమే నిత్యావసర వస్తువులు, కూరగాయలు మార్కెట్ నిర్వహణకు అనుమతులుండేవి. కేసులు తగ్గడంతో, లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ ఉదయం 7 గం. నుంచి సాయంత్రం 7 గంటలవరకు దాదాపు అన్ని రకాల దుకాణాలు తెరిచేందుకు అనుమతించారు. రెండు నెలలు తరువాత సినిమా హాళ్లు, మాల్స్​ , హోటల్స్ మినహా దుకాణాలు అన్ని తెరుచుకున్నాయి. కంటైన్మెంట్ జోన్స్​ పరిధిని గోపాల్​నగర్, ఏకలవ్య నగర్ ప్రాంతాల్లో ఆంక్షలు విధించినందున ఆ ప్రాంతాల్లో మాత్రం దుకాణాలు తెరుచుకోలేదు. ఏకలవ్య కాలనికి సమీపంలో ఆర్టీసీ బస్టాండ్, చేపలు మార్కెట్ ఉండటం వల్ల ఈ ప్రాంతాల్లో కార్యకలాపాలు నిర్వహించడం లేదు. ఆర్టీసీ బస్సులు యధావిధిగా పట్టణ శివారు ప్రాంతాల నుంచే రాకపోకలు సాగిస్తున్నాయి.

ఇది చదవండి నియోజకవర్గానికో పారిశ్రామిక వాడ....

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.