ETV Bharat / state

'' చిన్న వయస్సు నుంచే... మంచి, చెడులు నేర్పించండి" - Garikapati Pravachanam

మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునితక సంతరించుకుంటున్న సమాజంలో ప్రతి ఒక్కరిలో ఆందోళన తీవ్ర స్థాయిలో  పెరిగిపోతుందని... అది చిన్న పిల్లల్లో కూడా ఏర్పడడం మంచి పరిణామం కాదని ప్రముఖ ప్రవచనకర్త... సహస్త్రావధాని గరికపాటి నరసింహారావు అన్నారు.

ప్రకాశం జిల్లాలో రాష్ట్ర స్థాయి రచయితల మహాసభ

author img

By

Published : Jan 18, 2020, 12:05 AM IST

ప్రకాశం జిల్లాలో రాష్ట్ర స్థాయి రచయితల మహాసభ

ప్రకాశం జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో తొమ్మిదో రాష్ట్ర స్థాయి రచయితల మహాసభ జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ ప్రవచనకర్త... సహస్త్రావధాని గరికపాటి నరసింహారావు హజరయ్యారు. . ఆంధ్ర సాహిత్యం - ఆధునిక జీవితం అనే అంశంపై మాట్లాడారు. నేటి జీవితం పరుగుల మయంగా మారిందని... దీంతో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు అనవసర ఆందోళనతో మనసు పాడు చేసుకుంటున్నారని అన్నారు. చిన్న వయస్సులోనే చదువులు.. ర్యాంకుల పేరిట పిల్లల ఆలోచనల్ని ఎదగనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో చెడు వేగంగా వ్యాపిస్తుందని వీటన్నింటికి మన పురాణ.. సాహిత్యాల్లో సరైన పరిష్కారాలు ఉన్నాయని వాటి అందిపుచ్చుకోవడంలో మనం విఫలమవుతున్నామన్నారు. సాహిత్య అభిలాషను అలవరుచుకోవడం ఉత్తమమైన గుణంగా అభివర్ణించారు. చిన్న వయస్సు నుంచే మంచి చెడులు చెప్పాలని... మన సాహిత్యంలో ఎంతో గొప్పగా కథల రూపంలో మంచి నీతిని బోధించారని... వాటిని అర్థమైయ్యేలా వివరించాలన్నారు. యువత దారి తప్పుతుందని అంటున్నవారు వారికి సరైన దారి చూపించాలని... మంచిని గ్రహించే విచక్షణ నేర్పించాలని అన్నారు. యువతకు వ్యవహారిక జ్ఞానం కొరవడుతుందని... పూర్తిగా పుస్తకాలపై..ర్యాంకులపై దృష్టి పెట్టి సమాజంలో ఇమడలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. అద్భుతమైన పురాణ కథలు... సాహిత్య కల్పనలు అమూల్యమైన విషయాలను అందిస్తున్నాయని వాటిని అధ్యయనం చేసి... పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని సూచించారు.

ఇవీ చదవండి

విజవాయడలో " సంరక్షణ మహోత్సవం"

sample description

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.