మాదక ద్రవ్యాల రవాణా, వినియోగం కేసులోనే ఎక్కువమంది మహిళా ఖైదీలు శిక్ష అనుభవిస్తున్నారని రాష్ట్ర హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో 75 సంవత్సరాల స్వాతంత్య్ర ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న మద్యపాన విమోచన కమిటీ అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. స్వచ్ఛంద సంస్థలు, విద్యావేత్తలు మద్యపాన వినియోగం వల్ల వచ్చే నష్టాలపై వివిధ కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహించాలని ఆమె కోరారు.
యువతకు చైతన్యం కల్పించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని మద్య విమోచన కమిటీ ఛైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో కలెక్టర్ పోలా భాస్కర్, ఎస్పీ సిద్దార్థ కౌశల్ ప్రసంగించారు.
ఇదీ చదవండీ.. ఇసుక దోపిడిని అరికట్టేందుకే నూతన విధానం: మంత్రి పెద్దిరెడ్డి