వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల పరిస్థితి రోజురోజుకు దయనీయంగా మారుతోంది. ఝార్ఖండ్ రాష్ట్రం లాతూర్ జిల్లాకు చెందిన వలస కూలీలు కర్ణాటక రాష్ట్రంలో చిక్కుకుపోయారు. ఆ రాష్ట్రంలోని ధార్వాడ జిల్లా నుంచి దాదాపు 1800 కిలోమీటర్లు ప్రయాణించడానికి సైకిల్ మీద బయలుదేరారు కొంతమంది వలస కూలీలు. ఐదో తారీఖు సాయంత్రం బయలుదేరి ఈరోజు ప్రకాశం జిల్లా గిద్దలూరు చేరుకున్నారు. రోజుకు 100 నుంచి 120 కిలోమీటర్లు సైకిల్ తొక్కుతూ దారిలో తినడానికి తిండి, నీళ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు.
ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సొంత గూటికి చేరాలన్న లక్ష్యంతో సుదూర ప్రయాణం సాగిస్తున్న వీరిని ఈటీవీ, ఈనాడు బృందం పలుకరించింది. వారి కష్టాలను తెలుసుకొని ఉదయం అల్పాహారాన్ని, పండ్లు అందజేసింది. అయితే వీరు కర్ణాటకలో రోడ్డు నిర్మాణ కంపెనీలో పని చేస్తున్నామని, యాజమాన్యం జీతాలు ఇవ్వని కారణంగా.. సొంత డబ్బులతో సైకిళ్లు కొనుక్కుని ఝార్ఖండ్‌కు బయలుదేరామని తెలిపారు.
ఇవీ చూడండి: