ప్రకాశం జిల్లా దర్శి మండలంలో తహసీల్దార్, రెవెన్యూ అధికారులు సామూహిక సెలవుల్లో ఉండడం వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి రోజు అర్జీదారులతో కిటకిటలాడే కార్యాలయం గత 5 రోజులుగా బోసిపోయి కనిపిస్తోంది. తహసీల్దార్ తమను వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపిస్తూ... మండల పరిధిలోని అన్ని గ్రామాల వీఆర్వోలు సాముహికంగా సెలవులు పెట్టి నిరసన వ్యక్తం చేస్తున్నారు. తహసీల్దార్ సైతం సెలవు తీసుకోవడం వల్ల ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చే సామాన్య ప్రజానీకానికి ఇబ్బందులు తప్పడం లేదు.
ఇదీ చదవండి: