ETV Bharat / state

Sri Venkateswara Swamy Temple Garden Attracting Devotees: పచ్చదనంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలు.. - Prakasam News

Sri Venkateswara Swamy Temple Garden Attracting Devotees: ప్రకాశం జిల్లా మల్లవరంలో ఉన్న శ్రీ వేంటేశ్వర స్వామి దేవాలయ ఆవరణలోకి అడుగుపెడితే.. మనసు అహ్లాదంతో పులకరించిపోతుంది. చుట్టూ ఉండే పచ్చదనం, రంగు రంగుల కుసుమాలతో నిండిన ఉద్యానవనం సందర్శకులను కట్టిపడేస్తుంది. ఇందుకు కారణం గత నాలుగేళ్లుగా మల్లవరం గ్రామస్థులు చేస్తోన్న కృషి అని చెప్పవచ్చు.

Attracting_Devotees_to_Sri_Venkateswara_Swamy_Temple_Garden

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 28, 2023, 1:43 PM IST

Updated : Sep 28, 2023, 2:33 PM IST

Sri Venkateswara Swamy Temple Garden Attracting Devotees in Mallavaram : ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరంలో కొండమీద 12వ శతాబ్ధంలో నిర్మించిన పురాతన శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ తుమ్మ చెట్లు, గుట్టలతో భయంకరంగా ఉండేది. గుండ్లకమ్మ నదీపై రిజర్వాయర్‌ (Reservoir on Gundlakamma River) నిర్మించినప్పటికీ అదే పరిస్థితి. పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందాల్సిన ఈ ప్రాంతాన్ని పాలకులు నిర్లక్ష్యం కారణంగా భయంకరంగా ఉండేది. ఈ పరిస్థితి చూసిన ఈదుమూడికి చెందిన కావూరి వాసు బాబు ఆధ్వర్యంలో, మల్లవరం గ్రామస్థులు శ్రీవారి వనం కమిటీ ఏర్పాటు చేసుకుని ఉద్యాన వనాల పెంపకానికి శ్రీకారం చుట్టారు. 2019 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకునేలా ఉద్యానవనం

Beautiful Surroundings of Sri Venkateswara Swamy Temple in Mallavaram : పిచ్చి మొక్కలను, ముళ్ళపొదలను తొలగించి పర్యావరణానికి పనికి వచ్చే వివిధ రకాల మొక్కలు నాటడం ప్రారంభించారు. ఉసిరి, వేప, దేవర, రాగి, చింత, నేరేడు వంటి 43 వృక్ష జాతులు, తులసి, మందార, గులాభి వంటి పూల పత్రాలు ఇచ్చే వందలాది మొక్కలు ఆలయం పరిసరాల్లో పెంచుతున్నారు. వీరి కృషిని చూసి గుండ్లకమ్మ ప్రాజెక్టులో ఉన్న ప్రాంతాన్ని కూడా ఈ కమిటికి అప్పగించారు.

ఆ శ్మశానం ఓ నందనవనం.. భయం లేని బృందావనం

అక్కడ కూడా ఉద్యాన వనం, ఉసిరి వనం పేరుతో వివిధ రకాల మొక్కలు నాటారు. వేలాది మొక్కలు పెరిగి పచ్చదనాన్ని, చక్కనైన గాలిని అందిస్తున్నాయి. తాజాగా చివరి విడత మరికొన్ని మొక్కలను ప్రకాశం జిల్లా జడ్జి భారతి చేతులు మీదుగా నాటారు. ఈ కార్యక్రమానికి ఎక్సైజ్‌ కోర్టు న్యాయమూర్తి ఆర్ వెంకటేశ్వర శర్మ , జిల్లా న్యాయ సేవాధికర సంస్థ కార్యదర్శి, శ్యాంబాబులు పాల్గొన్నారు. పండిట్‌ రవి శంకర్​కు చెందిన ఆర్ట్స్‌ ఆఫ్‌ లివింగ్‌ సహకారంతో ఈ విడత మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

శ్రీవారి వనం కమిటి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం అంతా ఉద్యానవనాలతో నింపడమే కాకుండా పర్యాటకులకు , భక్తులుకు సౌకర్య వంతంగా ఉండేందుకు పలు నిర్మాణాలు కూడా చేపట్టారు. ఆలయ ప్రాంగణంలో దాదాపు కోటి రూపాయలతో కళ్యాణ కట్ట, వసతి గదులు, ఉద్యానవనాల్లో కూర్చునేందుకు సిమ్మెంట్‌ బల్లలు, తాగు నీటి సౌకర్యాలు. మెట్లు మార్గాలు, స్వామి వారి తెప్పోత్సవాలు నిర్వహణ కోసం తటాకాన్ని సుందరంగా తీర్చి దిద్దడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గ్రామస్థులు, స్వఛ్చంద సంస్థలు సహకారాన్ని అందిస్తున్నారు.

Kesarapalli Garden: అప్పుడు పరుగులు.. ఇప్పుడు జాడ లేని పనులు

Sri Venkateswara Swamy Temple Garden Attracting Devotees: పచ్చదనంతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ పరిసరాలు..

Last Updated : Sep 28, 2023, 2:33 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.