ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని డా. డాక్టర్ బీఆర్. అంబేద్కర్ - బాబు జగ్జీవన్‌రామ్ ఆడిటోరియం నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. స్థానిక ఎంపీడీవో కార్యాలయ ఆవరణలోని ఖాళీ స్థలంలో 2017 డిసెంబర్ 8న అప్పటి ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్ రాజు శంకుస్థాపన చేసి, నిధులు మంజూరు చేశారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత ఇసుక కొరత, ఇతర కారణాలతో నిర్మాణంలో కొంత ఆలస్యం జరిగింది. ఈ మధ్యకాలంలో మళ్లీ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. మిగతా పనులు త్వరగా పూర్తి చేసేందుకు పనులు చురుగ్గా సాగుతున్నాయి.
ఇవీ చూడండి...